News November 30, 2025
అమలులో ఎలక్షన్ కోడ్.. ప్రజావాణి రద్దు: జనగామ కలెక్టర్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News March 20, 2026
ఏలూరు జిల్లాలో పవర్ పెట్రోల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పవర్ పెట్రోలు ధరలు పెరగడంతో ఏలూరు జిల్లా కేంద్రంలో HPCL గతంలో రూ.117.68 ఉండగా శుక్రవారం నుంచి రూ.119.87 పైసలు పెరిగిందన్నారు. BPCL భారత్ పెట్రోల్ గతంలో రూ.117.17 పైసలు ఉండగా 119.36 పైసలుగా విక్రయిస్తున్నారు. IOCL ఇండియన్ పెట్రోల్ గతంలో రూ.117.57 ఉండగా రూ.119.80 పైసలుగా విక్రయిస్తున్నారు. రూ.2.19 పైసల పెరిగిందన్నారు. నార్మల్ పెట్రోల్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
News March 20, 2026
సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News March 20, 2026
యుద్ధం కొనసాగితే LPG సప్లయ్ చైన్‌కు దెబ్బే: CBN

AP: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే LPG గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని CM CBN ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు VCలో సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, PNG వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్‌కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు.


