News November 30, 2025

రేపటి ప్రజావాణి రద్దు: MHBD కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, కావున ప్రజలు.. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.

Similar News

News March 5, 2026

10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు Arrive-Alive కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 5, 2026

మామునూరు ఎయిర్పోర్టు.. హద్దులను పరిశీలించిన కలెక్టర్

image

మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల నేపథ్యంలో కొత్తగా భూసేకరణ చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా సేకరించిన భూముల సర్వే నంబర్లు, నిర్ణయించిన హద్దులను కలెక్టర్ పరిశీలించారు. భూహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News March 5, 2026

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్

image

పొడవైన విద్యుత్ లైన్లలో(25 కి.మీ కంటే ఎక్కువ) విద్యుత్ సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడానికి
ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు బిగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. 33KV ఫీడర్లలో 775, 11KV ఫీడర్లలో 15352 ఇన్‌స్టాల్ చేశామన్నారు. లైన్లను జీఐఎస్ మ్యాప్పింగ్ 33 కేవీ 671 ఫీడర్లలో 14544 కిలో మీటర్లు,11 కేవీ 4471 ఫీడర్లలో 40572 కిలో మీటర్లు పూర్తి చేశామని చెప్పారు.