News November 30, 2025

రేపు నూజివీడులో PGRS కార్యక్రమం

image

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రజల అర్జీలు ఆన్‌లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు.

Similar News

News March 8, 2026

ఈమె ఎదురీత ముందు విధిరాత ఎంత!

image

పదేళ్లు వీల్‌ఛైర్‌కు పరిమితమైన యువతి సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకు సాధించారు. ఆమెనే కేరళకు చెందిన అథిర(30). BDS చదువుతుండగా యాక్సిడెంట్ జరగడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా లేదు. ఆ తర్వాత BDS పూర్తి చేశారు. NGOలోని డిసెబిలిటీ వింగ్‌లో పనిచేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని, పేరెంట్స్&సిస్టర్ సాయంతో చదివానని అథిర తెలిపారు.

News March 8, 2026

ఇందిరాగాంధీనే ఎదిరించిన పాలమూరు వనిత..!

image

గద్వాల జిల్లా అలంపూర్‌లో జన్మించిన టి.లక్ష్మీకాంతమ్మ తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఖమ్మం నుంచి ఒకసారి MLAగా, మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని ఎదిరించి జనతాలో చేరారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితురాలు. పీవీ రాసిన ‘ది ఇన్‌సైడర్’ నవలలోని ‘అరుణ’ పాత్రకు స్ఫూర్తి అని ప్రతీతి. # నేడు అంతార్జాతీయ మహిళ దినోత్సవం

News March 8, 2026

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం.. వాస్తవం ఇదే!

image

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం లభ్యం అంటూ SMలో వస్తున్న వార్తలపై FACT CHECK స్పందించింది. ‘తిరుపతి రూరల్ పాడిపేట ఇందిరమ్మ గృహాల వద్ద చంద్రగిరి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగేష్ రెడ్డి(38) నివాసంలో 34 లీటర్ల అనధికార మద్యం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి కెమికల్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు’. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.