News November 30, 2025

ఆన్‌లైన్‌లో సింహాచలం దర్శనం‌ టికెట్స్

image

సింహాచలం వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్. దేవదాయ శాఖ సూచనల మేరకు దేవస్థానం వసతి గదులు, దర్శనాలు, ప్రత్యేక పూజలు, ఇతర సేవల బుకింగులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో సుజాత ఆదివారం తెలిపారు. వీరికి ప్రత్యేక మార్గం ద్వారా దర్శనం, ప్రత్యేక లడ్డు ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News March 14, 2026

CTR: వాటర్ బాటిల్ ధరల పెంపు ఇందుకే.!

image

ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ‘పాలిమర్’ వాటర్ బాటిల్ తయారీకి కీలకం. యుద్ధ నేపథ్యంలో చమురు రేట్లు పెరగటంతో పాలిమర్ రేట్లు సైతం 50% మేర పెరిగాయి. ఇక వాటర్ బాటిల్ క్యాప్ ధర కూడా దాదాపు రూ.0.50 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో పాలిమర్ KG ధర రూ.160-180 మధ్య ఉంది. ఇంతకు ముందు ఇది రూ.10లోపే ఉండేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో దుకాణాల్లో <<19382920>>వాటర్ బాటిల్స్<<>> ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.

News March 14, 2026

IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్‌గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్‌లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్‌లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.

News March 14, 2026

గ్యాస్‌ బుకింగ్‌ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

image

గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.