News November 30, 2025
ఊట్కూరు: ఎర్గట్‌పల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవ తీర్మానం

ఊట్కూరు మండలంలోని ఎర్గట్‌పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు నిర్ణయించారు. గ్రామస్థులు బాలమ్మ ఓళ్ల జయమ్మ శ్రీనివాసును సర్పంచ్‌గా, MD.సాజిద్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు ఒప్పందం చేశారు. 430 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్న గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి రూ.6 లక్షలు, ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.2 లక్షలు, ప్రతి వార్డు సభ్యుడు రూ.5,000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదించారు.
Similar News
News March 16, 2026
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు

కొణిజర్ల మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చిన్నమునగాల పాఠశాలలో సందడి చేశారు. తరగతి గదిలోకి వెళ్లిన ఆయన స్వయంగా ఉపాధ్యాయునిలా మారి విద్యార్థులకు ఆంగ్ల అక్షరాలు, పదాల ఉచ్చారణను నేర్పించారు. వారితో ముచ్చటించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
News March 16, 2026
200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్‌ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.
News March 16, 2026
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.


