News November 30, 2025
సాయంత్రం 6.30 గంటలకు సీఎం ప్రెస్‌మీట్

TG: DEC 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో CM రేవంత్ ఇవాళ 6.30PMకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సమ్మిట్ నిర్వహణతో పాటు పంచాయతీ ఎన్నికలపై మాట్లాడే అవకాశం ఉంది. ఇదే విషయమై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
News March 24, 2026
ఇంధన ఎమర్జెన్సీ.. ఫిలిప్పీన్స్ ఏం చేస్తోందంటే?

ఇంధన వనరుల(పెట్రోల్, గ్యాస్, విద్యుత్) కొరత ఏర్పడి ప్రజా సంక్షేమానికి ముప్పు కలిగే పరిస్థితే ఇంధన ఎమర్జెన్సీ. దీన్ని నివారించేందుకు ఫిలిప్పీన్స్ <<19467390>>ఎమర్జెన్సీ<<>> ప్రకటించింది. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు UPLIFT పథకంతో సాయం చేయనుంది. ఇంధన ఆదాకు చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపనుంది. 10 లక్షల బ్యారెళ్ల చమురును బఫర్ స్టాక్‌గా పెట్టనుంది. ఇంధన సరఫరాదారులకు ముందస్తు చెల్లింపులు చేయనుంది.


