News November 30, 2025

తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధం: SP

image

దిత్వా తుఫానును ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని బాపట్ల SP ఉమామహేశ్వర్ ఆదివారం తెలిపారు. 5 మండలాలపై దాని ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. నిరంతరం వైర్‌లె సెట్‌తో పర్యవేక్షిస్తున్నామని మంత్రికి వివరించారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి వెనక్కి వచ్చేసినట్లు సమాచారం అందిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 19, 2026

తిరుపతి బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ

image

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు నిలయంగా మారింది. రద్దీని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి 24 సెల్ ఫోన్లు దొంగలించారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన అనూష రాజంపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా 150 గ్రా. బంగారు నగల బ్యాగు చోరీకి గురైంది.

News March 19, 2026

ఆ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరగదు.. ఇరాన్‌కు ట్రంప్ హామీ

image

సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఖతర్‌పై ఇరాన్ అటాక్ చేయడంపై ట్రంప్ స్పందించారు. సౌత్ పార్స్ దాడితో USకు సంబంధం లేదని తెలిపారు. అలాగే ఆ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేయదని హామీ ఇచ్చారు. ఖతర్‌పై మరోసారి దాడులకు దిగితే మాత్రం ‘సౌత్ పార్స్’ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అలా జరగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. దీర్ఘకాలంలో ఇరాన్‌కు చాలా నష్టం అన్నారు.

News March 19, 2026

నల్గొండ: జాతీయ ఫుట్‌బాల్‌లో తేజు ప్రతిభ

image

హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. స్థానికులు తేజును అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆశిస్తున్నారు.