News November 30, 2025
NTR-Neel వింటర్ నైట్ షూట్

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఎంతో శ్రమించి బరువు తగ్గారు. కొంతకాలం క్రితం NTR లుక్‌ను నీల్ ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ మొదటి వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ నైట్ షూట్ షెడ్యూల్‌ను టీమ్ ప్రారంభించబోతోంది. ఈ షెడ్యూల్ మూవీలో అత్యంత కీలకమని సమాచారం.
Similar News
News March 16, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.
News March 16, 2026
CNG సరఫరాలో కొరత లేదు: కేంద్రం

దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో క్రూడ్ ఆయిల్ సరిపడా ఉందని.. రిఫైనరీలు అన్నీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయంది. పెట్రోల్ పంప్స్‌లో ఎలాంటి కొరత లేదని పేర్కొంది. దేశానికి శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల LPG రానున్నట్లు తెలిపింది.
News March 16, 2026
భారత్‌కు ఆయిల్ తేవడమే టార్గెట్.. యుద్ధంలోనూ తగ్గేదేలే!

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా భారతీయ నౌకలు క్రూడ్‌తో దేశానికి సేఫ్‌గా తిరిగొస్తున్నాయి. తాజాగా జగ్ లాడ్కి అనే నౌక సాహసోపేతంగా వార్ జోన్‌ను దాటేసింది. UAEలోని ఫుజైరా పోర్టుపై శనివారం దాడి జరిగినప్పుడు ఈ నౌక చమురు నింపుకుంటోంది. అయినా 80,800 టన్నుల ముర్బాన్ క్రూడ్ లోడ్ చేసుకొని నిన్న తిరుగుప్రయాణమైంది. కాగా 92,712 టన్నుల LPGతో శివాలిక్, నందాదేవి అనే నౌకలు కూడా భారత్ చేరుకోనున్నాయి.


