News November 30, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 49 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 113 కేసులు నమోదయ్యాయి.
ట్రాఫిక్ పరిధి 49, వెస్ట్ జోన్ పరిధి 03, ఈస్ట్ జోన్ పరిధి 13, సెంట్రల్ జోన్ పరిధిలో 21 కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 3, 2025

నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

image

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

News December 3, 2025

ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

image

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.

News December 3, 2025

‘పంచాయతీ’ పోరుకు యువత జై!

image

TG: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో యువతే అధికంగా ఉన్నారు. పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్‌లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది. రెండు విడతల్లో 70శాతానికి పైగా నామినేషన్లలో 30-44 ఏళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.