News November 30, 2025
ఏలూరు జిల్లాలో పెన్షన్ పంపిణీకి సిద్ధం.!

ఏలూరు జిల్లాలో 2,59,688 మంది పెన్షన్ దారులకు రూ.113.63 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభమౌతుందన్నారు. మొదటిరోజు 100% పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనివార్య కారణాల వలన 1వ తేదీన తీసుకోనివారికి 3వ తేదీన పంపిణీ చేయబడుతుందన్నారు. 5039 మంది సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేస్తారన్నారు.
Similar News
News March 11, 2026
సూర్యాపేట: కొత్త పింఛన్లు ఇంకెప్పుడు..!

సూర్యాపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై స్పష్టత లేదు. పాత పింఛన్లు ఆగిపోతున్నాయే తప్ప, అర్హులైన కొత్తవారికి మాత్రం ఊరట లభించడం లేదు. పేదలు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
News March 11, 2026
TG గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.
News March 11, 2026
విశాఖ నీటి భద్రతకు వ్యూహాత్మక ప్రణాళిక

అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు భవిష్యత్ నీటి భద్రత కోసం సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని VER సీఈవో యువరాజ్ అన్నారు. GVMC ఆధ్వర్యంలో నోవోటెల్‌లో జరిగిన ‘క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ఫర్ వాటర్ సెక్టార్’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సూచించారు.


