News November 30, 2025

కొండగట్టు బాధితులకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలి: KTR

image

కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొండగట్టులో జరిగిన నష్టం వివరాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడమే ఆస్తి నష్టం భారీగా జరగడానికి ప్రధాని కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం అన్నారు.

Similar News

News March 22, 2026

కాంగ్రెస్ బడ్జెట్‌పై పెద్దపల్లి బీఆర్‌ఎస్ నేతల ఘాటు విమర్శలు

image

PDPL ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం చూపారన్నారు. KCRహయాంలో అభివృద్ధి చెందిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని విమర్శించారు.

News March 22, 2026

రేపు PGRS రద్దు: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ ప్రకటించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో https://www.google.com/search?q=Meekosam.com నమోదు చేసుకోవాలని, పరిష్కార స్థితి కోసం 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.