News November 30, 2025
వరంగల్: పేరుకే వేర్వేరు గ్రామాలు..!

సాధారణంగా ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. కానీ, ఇక్కడ గ్రామాలు వేరే అయినా ఆ గ్రామాలు కలిసే ఉంటాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నెలకొంది. తురకల సోమారం-జమల్‌పురం రెండు గ్రామాలు ఒకే చోట కలిసి ఉంటాయి. అచ్చం ఇలాగే నారాయణపురం-రోళ్లకల్లు గ్రామాలు సైతం కలిసే ఉంటాయి. గ్రామాలు ఒకే చోట ఉన్నా గ్రామ పంచాయతీలు మాత్రం వేర్వేరు కావడం విశేషం.
Similar News
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
News March 7, 2026
వార్‌కు వారం!

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
News March 7, 2026
ఊర్కొండ: సర్పంచ్ భర్తపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

ఊర్కొండ సర్పంచ్ భర్త మేకల శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులను, ఎస్సీ వర్గానికి చెందిన వారిని దుర్భాషలాడిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుపై కల్వకుర్తి డీఎస్పీ దర్యాప్తు చేయనున్నారని ఎస్సై కృష్ణదేవ తెలిపారు.


