News November 30, 2025
భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో చెలరేగారు. ఏకంగా 7 సిక్సర్లు, 11 ఫోర్లు బాదారు. రోహిత్ (57), కేఎల్ రాహుల్ (60) రాణించగా.. జైస్వాల్ 18, గైక్వాడ్ 8, సుందర్ 13, జడేజా 32 రన్స్ చేశారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News April 6, 2026
ALERT: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా?

వాషింగ్ మెషీన్ ఆన్‌లో ఉన్నప్పుడు స్నానం చేయొద్దని ఎలక్ట్రీషియన్లు సూచిస్తున్నారు. ‘మెషీన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ వల్ల షాక్ తగిలే అవకాశం ఉంది. వైబ్రేషన్, ప్రెజర్ వల్ల వైరింగ్ దెబ్బతిని తడి ప్రాంతానికి తగలొచ్చు. పైగా మెషీన్, షవర్‌కు ఒకే వేస్టేజ్ పైప్ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే దాన్ని ఆఫ్ చేశాక 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది’ అని చెబుతున్నారు. #SHARE IT
News April 6, 2026
ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు

AP: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. నిన్న మన్యం(D) వీరఘట్టం, నెల్లూరు(D) నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీకాకుళం, నెల్లూరు, మన్యం తదితర జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈరోజు SKL, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు <<19576125>>వర్షాలు<<>> పడతాయని APSDMA వెల్లడించింది.
News April 6, 2026
పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>


