News November 30, 2025
నిడుగుర్తి సర్పంచ్ ఏకగ్రీవం.. ఆలయాభివృద్ధికి రూ.15.50 లక్షల నిధులు

ఊట్కూర్ మండలంలో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. మూడో విడత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు ముందుగానే ఏకగ్రీవ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిడుగుర్తి గ్రామ ప్రజలు బుడ్డ రాములను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. గ్రామంలోని గుట్టపై ఉన్న గౌరీ శంకర ఆలయ అభివృద్ధి కోసం రాబోయే సర్పంచ్ అభ్యర్థి రూ.15.50 లక్షలు అందించేందుకు గ్రామస్థులు అతనితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 7, 2026
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
News March 7, 2026
క్యాన్సర్‌ను ఓడించి UPSC విజేతగా రైతు బిడ్డ

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహారియా UPSC 2025 ఫలితాల్లో 946వ ర్యాంకుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. రైతు బిడ్డ అయిన ఆయన ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలో చూపు మందగించింది. అయినా వెనకడుగు వేయలేదు. రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా 38 ఏళ్ల వయసులో UPSC ర్యాంకు సాధించారు. 3 ఉద్యోగాలకు రాజీనామా చేసి, అనారోగ్యాన్ని జయించి సాగించిన ఈ జర్నీ అనేక మందిని ఇన్‌స్పైర్ చేస్తోంది.
News March 7, 2026
కామారెడ్డి పోలీస్ ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్!

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో వరుస దొంగతనాలకు చెక్ పడటమే కాకుండా, అంతర్రాష్ట్ర ముఠాలు సైతం పట్టుబడుతున్నాయి. ఇటీవల రామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు దొంగతనాల కేసులను ప్రతిభావంతంగా ఛేదించారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు సిబ్బందిని అభినందించారు.


