News November 30, 2025

విశాఖలో దారుణం

image

విశాఖలోని శివాజీపాలెం చిన్నపోలమాంబ గుడి వద్ద పసికందు మృతదేహం వెలుగు చూసింది. గుడి ఎదురుగా ఉన్న వీధిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఏ సమయంలో ఇక్కడ పెట్టేశారో తెలియదు కానీ స్థానికంగా కలకలం రేగింది. ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పసికందుని ఆసుపత్రికి తరలించారు. ఎవరు పడేశారో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Similar News

News March 22, 2026

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం: ఎస్పీ

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా 1 ఫిబ్రవరి 2026 నుంచి ఇప్పటివరకు 41 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. 159 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.4,82,394 స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 10 కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించి 84 మందిని అదుపులోకి తీసుకున్నామన్నాడు. వారి నుంచి రూ.2,10,180 నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News March 22, 2026

మహిళలకే క’న్నీటి’ కష్టాలు

image

నీటి కొరతతో ఎక్కువగా మహిళలు, బాలికలే ఇబ్బంది పడుతున్నట్లు యూఎన్ రిపోర్ట్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. గ్లోబల్‌గా మహిళలు/బాలికలు నీటి సేకరణకే రోజుకు 25కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. నీరు సరఫరా లేని 70%కుపైగా గ్రామాల్లో నీటి బాధ్యత మహిళలదే. దీంతో వారి విద్యకు, ఆదాయానికి, ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికీ 210 కోట్లకుపైగా ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదు. >నేడు ప్రపంచ నీటి దినోత్సవం.

News March 22, 2026

23 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు: కలెక్టర్

image

మార్చి 23వ తేదీ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని ఇరువారం దగ్గర తాత్కాలిక విద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ ప్రక్రియలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలకు 8919820152 / 9476007488 నంబర్లను సంప్రదించాలని కోరారు.