News November 30, 2025
మల్లన్న పేరు మీదనే సాగర్ నిర్మాణం: హరీశ్ రావు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామి పేరు మీదనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిర్గాపూర్‌లో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే మల్లన్న సాగర్ నీరు ఖేడ్ ప్రాంతానికి సరఫరా అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు.
Similar News
News March 27, 2026
45 ఏళ్లకే ₹కోటితో రిటైర్‌మెంట్: ఏం చేయాలి?

30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 45 ఏళ్లకు రిటైర్ అవ్వడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేస్తూ 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించొచ్చు. ఇందులో ₹5,000 గోల్డ్‌లో, ₹9,500 MFలో పెట్టాలి. ఏటా పెట్టుబడిని 10% పెంచుతూ వెళ్తే కాంపౌండింగ్ పవర్‌తో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. గోల్డ్ ద్వారా సుమారు ₹20 లక్షలు, MF ద్వారా ₹82 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
News March 27, 2026
వేసవికాలం.. కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం


