News November 30, 2025
చిట్యాల: ఎన్నికలు వస్తే ఆ ఊరిలో ఘర్షణ వాతావరణం!

జయశంకర్ జిల్లాలో ఎన్నికల సమయంలో పోలీసులు గుర్తించే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చిట్యాల మండలం చింతకుంట్లరామయ్యపల్లి(CRపల్లి) గ్రామం ఒకటి. అక్కడ ఏ ఎన్నికలు వచ్చినా, అభ్యర్థి ఎవరైనా ప్రతి ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘర్షణ తలెత్తి కొందరు యువకులు కేసుల పాలయ్యారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
Similar News
News March 18, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
Click on Whatsapp: <<7337592828>>73375 92828<<>>
News March 18, 2026
విద్యార్థుల పఠన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

విద్యార్థుల పఠన సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం టేకులపల్లి మండలంలో ఆయన ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల తీరును, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు.
News March 18, 2026
HYD: రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తోందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది. కాగా, ఇది వ్యవస్థాగతమైన భద్రతా వైఫల్యంగా అర్థమవుతోంది.


