News November 30, 2025

రేపు ప్రకాశం SP మీకోసం రద్దు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News March 6, 2026

10th విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితం: మార్కాపురం DM

image

మార్కాపురంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి సంస్థ అనుమతించినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కండక్టర్‌కు బస్సు పాస్‌తో సంబంధం లేకుండా హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు.

News March 5, 2026

మార్కాపురం: ప్రియురాలు పిలిచిందని వచ్చి దొరికాడు.!

image

మార్కాపురానికి చెందిన వ్యక్తిపై గుంటూరులో దాడి జరిగింది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో ఉండటం ఇష్టం లేని వివాహిత ఆమె ప్రియుడు నాగసాయికృష్ణకు చెప్పింది. ఈ క్రమంలో నాగసాయికృష్ణ మార్కాపురం నుంచి గుంటూరు వచ్చాడు. విషయం తెలుసుకున్న వివాహిత భర్త దినకర్ మరికొందరితో కలిసి నాగసాయికృష్ణపై కర్రలతో దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 5, 2026

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..

image

ప్రకాశం(D)లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. V.Vపాలెం (M) పోలినేనిపాలెంకి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి విప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరుకుంట వద్ద అన్నం తిని మంచినీటి కోసం శ్రీకాంత్ బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.