News November 30, 2025
ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు: BHPL కలెక్టర్

భూపాలపల్లి జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాబట్టి, ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావొద్దని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మోడల్ కోడ్ అమలులో ఉన్నందున అప్పటి వరకు ప్రజావాణి రద్దు ఉంటుందన్నారు.
Similar News
News December 1, 2025
జిల్లాలో వార్డులవారీగా ఆమోదం పొందిన నామినేషన్లు(తొలిదశ)

1. రుద్రంగి మండలం వార్డులు 86, నామినేషన్లు 162
2. చందుర్తి మండలం వార్డులు 174, నామినేషన్లు 393
3. వేములవాడ అర్బన్ మండలం వార్డులు 104, నామినేషన్లు 244
4. వేములవాడ రూరల్ మండలం వార్డులు 146, నామినేషన్లు 329
5. కోనరావుపేట మండలం వార్డులు 238, నామినేషన్లు 496
* మొత్తం వార్డు స్థానాలు 748
* ఆమోదం పొందిన నామినేషన్లు 1,624
News December 1, 2025
KNR: రెండో విడత.. మందకొడిగా నామినేషన్లు..!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత 418 గ్రామపంచాయతీలకు, 3,794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 121, వార్డు సభ్యులకు 209, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 100, వార్డు సభ్యులకు 116, జగిత్యాల సర్పంచ్‌కి 171, వార్డు సభ్యులకు 238, పెద్దపల్లి సర్పంచ్‌కి 91, వార్డు సభ్యులకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 1, 2025
తిరుమలలో డాలర్లు దొరకడం లేదు..!

తిరుమలలో బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. భక్తులు శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లు కొనుగోలు చేస్తుంటారు. కొన్ని రోజులుగా బంగారు డాలర్లు అందుబాటులో లేవు. చాలా మంది వాటి కోసం వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. భక్తుల సౌకర్యార్థం బంగారు డాలర్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు టీటీడీని కోరుతున్నారు.


