News November 30, 2025
ఎన్నికల భద్రత కట్టుదిట్టం: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో రెండో దఫా సర్పంచ్ నామినేషన్లు ప్రారంభం కావడంతో పోలీస్ విభాగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. జిల్లా వ్యాప్తంగా మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నాకబంది, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. అక్రమ నగదు రవాణా, మద్యం పంపిణీ వంటి చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయన్నారు.
Similar News
News March 7, 2026
హెలికాప్టర్‌లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 7, 2026
మాచర్ల ప్రభుత్వ ఐటీఐలో 9న అప్రెంటిస్ మేళా

మాచర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ పవన్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో ఐటీఐ పాసైన (అన్ని ట్రేడ్‌ల) విద్యార్థులు పాల్గొన వచ్చని చెప్పారు. ఈ మేళాకు వివిధ రకాల ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 7, 2026
డేరా బాబాకు భారీ ఊరట

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. 20 ఏళ్ల కిందట జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసింది. కాగా మహిళలపై అత్యాచారం కేసులో 2017 నుంచి డేరా బాబా జైలులో ఉన్నప్పటికీ దాదాపు 15 సార్లు పెరోల్‌పై బయటికొచ్చి వెళ్లారు.


