News November 30, 2025
పార్వతీపురం: ‘ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత’

ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఐసిటిసి కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ గర్భిణికి హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయించాలన్నారు. మన ఆరోగ్య భద్రత మన చేతిలో ఉందని, సురక్షిత జీవన శైలి పద్ధతులు అవలంబించాలన్నారు.
Similar News
News March 20, 2026
SKLM- HYDకి డైరెక్ట్ ట్రైన్స్ ఏర్పాటే నా లక్ష్యం: రామ్మోహన్

AP: శ్రీకాకుళం నుంచి నేరుగా HYD, తిరుపతికి రైలు సర్వీసుల ఏర్పాటే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం(D) హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైన 3 రైళ్లను ఆయన ప్రారంభించారు. 45 రోజుల్లోనే 6 రైల్వే స్టాప్‌లకు అనుమతి రావడం గర్వకారణమన్నారు. రవాణా వ్యవస్థను మరింత బలపరిచి, ఉపాధి అవకాశాలనూ పెంచే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
News March 20, 2026
నక్కపల్లి: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ

నక్కపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రత, ప్రోటోకాల్ అమలు చేయాలని ఐజీ ఆదేశించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
News March 20, 2026
రేపు జరగాల్సిన స్పాట్ వాల్యుయేషన్ వాయిదా

రంజాన్ పండుగ సందర్భంగా శనివారం SV జూనియర్ కళాశాల తిరుపతిలో జరగాల్సిన ఇంటర్మీడియట్ తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్, తమిళ్ స్పాట్ వాల్యూయేషన్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సబ్జెక్టులకు 23వ తేదీ స్పాట్ ప్రారంభమవుతుందని తెలియజేశారు.


