News November 30, 2025
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ డిసెంబరు 1న (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు అన్నారు.
Similar News
News March 28, 2026
జాగృతిలో చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సంస్థలో చేరారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News March 28, 2026
హనుమకొండ: విషాదం. విద్యార్థిని మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక తండాకు చెందిన బి.స్నితిక (14) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. సాగర్ – వాణి దంపతులు తమ పిల్లల చదువుల కోసం హనుమకొండలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె స్నితిక హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం HYDలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
News March 28, 2026
మిర్యాలగూడకు మళ్లీ ఎంపీ స్థానం దక్కేనా?

గతంలో పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మిర్యాలగూడకు మళ్లీ ఆ హోదా కల్పించాలని స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్లింగ్ కేంద్రంగా, వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ ప్రాంతానికి రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) లో న్యాయం చేయాలని కోరుతున్నారు. మళ్లీ ఎంపీ స్థానం వస్తే పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి జరుగుతుందని స్థానికులు బలంగా ఆకాంక్షిస్తున్నారు.


