News November 30, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో యువత ఎటువైపు?

image

ఉమ్మడి నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో యువత ఓటు నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. యువత అభ్యర్థుల ప్రలోభాలకు లొంగుతారా? లేక గ్రామ అభివృద్ధి, పారదర్శకత గురించి ప్రశ్నిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, యువ ఓటర్లు తమ ఓటు విలువను గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 28, 2026

ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

image

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.

News March 28, 2026

SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

image

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్‌కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్‌గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్‌లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.

News March 28, 2026

(UPDATE) విశాఖ: ఇండిగో విమానానికి తప్పిన పెనుప్రమాదం

image

విశాఖ నుంచి వెళ్తున్న <<19498361>>ఇండిగో<<>> 6E-579 విమానం ఇంజిన్ లోపంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బోయింగ్ 737 విమానంలో 161 మంది ప్రయాణికులు ఉండగా, వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఉదయం 10:54 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. సాంకేతిక లోపం గుర్తించిన పైలట్లు ప్రాధాన్యత ల్యాండింగ్ కోరగా విమానం సురక్షితంగా దిగింది.