News November 30, 2025
సైబర్ నేరాలకు అప్రమత్తతోనే అడ్డుకట్ట: ADB SP

సైబర్ నేరాలను ప్రజల అప్రమత్తతోనే అడ్డుకట్ట వేయగలమని జిల్లా SP అఖిల్ మహాజన్ వివరించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నవీన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 ద్వారా పోలీసు సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
Similar News
News March 21, 2026
పిట్లం: షీర్ ఖుర్మా.. పాలకు డిమాండ్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా పిట్లంలో పాల ధరలు పెరిగాయి. పండుగ ప్రత్యేక వంటకమైన ‘షీర్ ఖుర్మా’ తయారీకి పాలు ప్రధానం కావడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో కంటే అదనపు అవసరం ఉండటంతో పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో లీటర్ పాల ధర ఎంత ఉందో? కామెంట్ రూపంలో తెలియజేయండి.
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గుంటూరు: CRDA కమిషనర్‌గా విజయరామరాజు

CRDA కమిషనర్‌గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కమిషనర్‌గా పనిచేసిన కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. కాగా CRDA కమిషనర్‌గా విజయరామరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో CRDA కమిషనర్లుగా చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు, కన్నబాబు (ప్రస్తుతం) పనిచేశారు.


