News November 30, 2025
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం HILTP పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతోందని రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. రాహుల్ స్పందించకుంటే అందులో భాగస్వామ్యం ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని ఆరోపించారు. ఈ విధానంతో సీఎం సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభం పొందుతారని వివరించారు.
Similar News
News March 22, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.
News March 22, 2026
అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News March 22, 2026
అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.


