News November 30, 2025

ఏలూరు: రేపటి PGRSకు కలెక్టర్, JC దూరం.!

image

ఏలూరు జిల్లాలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో డిసెంబర్ 1న సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, JC అభిషేక్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందుబాటులో ఉండరన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు.

Similar News

News March 26, 2026

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News March 26, 2026

నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

కాకినాడ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, వాహన తనిఖీల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీలు, సీఐలకు స్పష్టం చేశారు.

News March 26, 2026

RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

IPL: ఎల్లుండి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో RCB జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ ఇండియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బెంగళూరుకు వచ్చారు. ఇవాళ RCB క్యాంప్‌లో జాయిన్ కానున్న ఆయన 28వ తేదీ SRHతో జరిగే తొలి మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమైన వేళ హేజిల్‌వుడ్ రాకతో RCB బౌలింగ్ దళం బలం పుంజుకున్నట్లు అయింది.