News November 30, 2025

కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

image

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

Similar News

News February 19, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.

News February 19, 2026

మహా శివరాత్రి.. కడప జిల్లా ఆర్టీసీకి ఆదాయం ఎంతంటే..!

image

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్ ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఆర్టీసీ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,46,077 KM నడిపినట్లు చెప్పారు. దీంతో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

News February 19, 2026

YVUలో కాన్వకేషన్.. డేట్ ఫిక్స్.!

image

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.