News November 30, 2025
నల్గొండ: లక్కీ ఛాన్స్.. సర్పంచ్ పీఠం ఆమెకే

మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వైంది. అయితే ఆ గ్రామంలో బ్రహ్మమల రోజా (33) ఒక్కరే ఎస్టీ మహిళా ఓటరుగా ఉన్నారు. ఆమె ఈ రోజు నామినేషన్ వేశారు. ఇక సర్పంచ్ కావడమే తరువాయి. మూడు, నాలుగో వార్డుకు అదే రిజర్వేషన్ వచ్చిందని, అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News March 15, 2026
కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.
News March 15, 2026
WGL: పెళ్లి చేసుకోవాల్సిన యువతికి HIV రక్తం ఎక్కించాడు.. ట్విస్ట్ ఇదే

HYD పోచారంలో పెళ్లి చేసుకోవాల్సిన <<19386582>>యువతి<<>>కి HIV రక్తం ఎక్కించిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడి(24) కుటుంబం 25 కేళ్ల క్రితం ఘట్కేసర్ పరిధి అన్నోజిగూడలో నివాసముంటుంది. ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యువకుడు వరుసకు మరదలైన యువతి(20)ని ప్రేమించిగా పెళ్లికి పెద్దలు సిద్ధమయ్యాడు. కాగా అతడి తండ్రి కొన్నేళ్ల క్రితం HIVతో చనిపోవడం, యువకుడికి HIV ఉందని తేలడంతో పెళ్లి రద్దైంది.
News March 15, 2026
ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.


