News November 30, 2025

భద్రాద్రి: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పరిశీలకులు

image

జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్, స్క్రూటినీ ప్రక్రియల పారదర్శక నిర్వహణను సమీక్షించేందుకు ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య పలు మండలాల్లో పర్యటించారు. ఆమె చంద్రుగొండ, రావికంపాడు, దామరాచర్ల, గానుగపాడు పంచాయతీలతో పాటు చుంచుపల్లి, విద్యానగర్ కాలనీ, 3, 4 ఇంక్లైన్ జీపీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 21, 2026

నవాబుపేటలో విషాదం.. టీడీపీ నేత ఆత్మహత్య

image

పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకి చెందిన టీడీపీ నాయకుడు, సొసైటీ అధ్యక్షుడు చింత వెంకటేశ్వరరావు (బుల్లియ్య) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శనివారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరివేసుకున్నారు. తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

News March 21, 2026

అభయారణ్యమే ములుగు జిల్లాకు అభయం..!

image

రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాలో ములుగు అగ్రస్థానంలో ఉంది. 7,27,821 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. గోదావరి నది పరివాహకంలో పరుచుకున్న అభయారణ్యం ఈ ప్రాంత ఆదివాసీల జీవనం, వన్యప్రాణుల మనుగడకు అభయమిస్తోంది. ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ విభాగం ద్వారా అటవీ జంతువుల సంరక్షణ చేపడుతున్నారు. అరుదైన అడవి దున్నలకు ములుగు వనం ఆశ్రయం ఇస్తోంది.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి పెద్దపులులు వచ్చిపోతున్నాయి.

News March 21, 2026

కృష్ణా వర్సిటీ పీజీ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్!

image

కృష్ణా వర్సిటీ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి PG కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. 2026 AUG 3 నుంచి ఫస్టియర్ క్లాసులు, జులై 27 నుంచి సెకండియర్ క్లాసులు ప్రారంభమై డిసెంబర్‌లో 1వ, 2027 ఏప్రిల్‌లో 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని KRU అధ్యాపకులు తెలిపారు. క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఇంటర్నల్ పరీక్షలు, సెలవుల పూర్తి వివరాలకు కృష్ణా వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.