News November 30, 2025

‘చెమట చుక్కల‌కు త‌ర్ఫీదు’: సింగరేణి సీఎండీ

image

కొత్తగూడెం: సింగ‌రేణి ప్రాంత యువ‌త జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డేలా తీర్చిదిద్దుతామని సీఎండీ బ‌ల‌రాం నాయక్ స్పష్టం చేశారు. ఇందుకోసం ‘చెమ‌ట చుక్క‌ల‌కు త‌ర్ఫీదు’ పేరుతో వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. దేశ‌, విదేశాల్లో విద్యా, ఉపాధి అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న కల్పించడం, స్ఫూర్తిదాయ‌క‌మైన సందేశాలు అందించి ఉన్న‌త ల‌క్ష్యాల‌ను ఎంచుకునేందుకు ఈ కార్య‌క్ర‌మం దోహదపడుతుందని ఆయన వివరించారు.

Similar News

News April 13, 2026

విశాఖ: స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

image

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీ‌ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2026

NGKL జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

image

NGKL జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.80 శాతం హాజరు నమోదైందని, పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన వెల్లడించారు.

News April 13, 2026

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ

image

అమలాపురంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ రాహుల్ మీనా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అదనపు ఎస్పీ ప్రసాద్‌తో కలిసి మొత్తం 24 అర్జీలను స్వీకరించిన ఆయన, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు.