News November 30, 2025
రిలీజ్‌కు ముందే “స్పిరిట్” రికార్డ్!

ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా “స్పిరిట్” మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో కలిపి రూ.160 కోట్ల రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ముందే భారీ డీల్ జరిగిందన్న వార్తలు మూవీపై క్రేజ్ మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు.
Similar News
News April 4, 2026
పంజాబ్ విజయం.. గర్వంగా ఉందన్న ప్రీతి జింటా

చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండటం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని పేర్కొన్నారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని కొనియాడుతూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
News April 4, 2026
IPL చరిత్రలో చెన్నై సరికొత్త రికార్డ్

IPL హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్ (PBKS)పై శుక్రవారం చేసిన 209 పరుగులతో కీలక మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించి అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను అందుకున్న టీమ్‌గా నిలిచింది. తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (35 సార్లు) ఉంది. 2010లో రాజస్థాన్‌పై చేసిన 246 పరుగులు ఇప్పటి వరకు చెన్నైకి హయ్యెస్ట్ స్కోర్.
News April 4, 2026
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్రకణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


