News November 30, 2025
మక్తల్: CM పర్యటన పటిష్ఠ బందోబస్తు- ఎస్పీ

మక్తల్ పట్టణంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంలో ఇతర జిల్లాల పోలీసులతో పాటు స్థానిక పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించామన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు.
Similar News
News March 18, 2026
ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.
News March 18, 2026
ఖమ్మం: ‘వనజీవి రామయ్య’కు గద్దర్ అవార్డు

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం HYD ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ్‌లు చిత్రబృందాన్ని అభినందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
News March 18, 2026
MBNR: ఈనెల 22న ‘రైతు భరోసా’.. 11 లక్షల మందికి ఊరట

యాసంగి సాగుకు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 22 నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలోని దాదాపుగా 11 లక్షల మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వం తొలుత సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని భావించినా.. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు సాగులో ఉన్నా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందనుంది.


