News November 30, 2025

మునగాలలో కలెక్టర్ తనిఖీలు

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. ఆదివారం ఆయన మునగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 16, 2026

మెదక్‌లో వివాహిత సూసైడ్

image

మెదక్ పట్టణంలోని ఇందిరాపురి కాలనీలో సుమలత(36) అనే గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మందాపూర్ గ్రామానికి చెందిన సుమలత.. రాయిలాపూర్ నివాసి శశివర్ధన్ రెడ్డి 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News March 16, 2026

శుక్రుడు మరీ ఇంత స్లోనా?

image

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 16, 2026

కాకినాడ: అధికారుల కళ్లుగప్పి.. రూటుమార్చిన ‘పులి’

image

పులి మరోసారి రూటుమార్చింది. జి.కొత్తపల్లిలో పట్టుకునేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే సాయంత్రం శంఖవరం కొండపై నుంచి దిగి హనుమాన్ బృందాల టార్గెట్ తప్పించుకుని అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వైపు ఉన్న సర్వే తోటలు, వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్లిందని అధికారులు ప్రకటించారు. విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. నిరంతర పర్యవేక్షణ చేస్తూ ప్రజల భద్రత, పులి సంరక్షణపై దృష్టిపెట్టారు.