News November 30, 2025
తిరుపతి: ఆ ఎమ్మెల్యేపై ఇంటర్నల్ విజిలెన్స్ ఎంక్వయిరీ…?

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై అదే నియోజకవర్గానికి చెందిన దేవర మనోహర్ DCM పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయడం విధితమే. ఈ విషయాన్ని DCM, సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారట. చంద్రగిరిలో నిజంగానే అక్రమాలలో వాస్తవాలను తెలుసుకొనేందుకు ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ విచారణ ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News March 21, 2026
దాడులు ఆపండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ

పశ్చిమాసియాలో 20 రోజులుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ 22 దేశాలు ఇరాన్‌కు లేఖ రాశాయి. ఈ జాబితాలో UAE, UK, బహ్రెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలున్నాయి. గల్ఫ్ రీజియన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దాడులను ఆపాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నాయి.
News March 21, 2026
శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.19 కోట్లు

30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించింది. 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 550 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించాయి. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
News March 21, 2026
ఇరాన్‌కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్‌ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్‌లో షియా, పాక్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువ.


