News November 30, 2025
ALERT.. రేపు అతిభారీ వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోనసీమ, ప.గో., కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. అటు కాకినాడ, తూ.గో., ఏలూరు, NTR, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2026
వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే?

పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ బెడ్ షీట్స్ వాడితే చల్లగా ఉంటాయి. రాత్రి మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం తినొద్దు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే గంట ముందు గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు తాగితే శరీరం చల్లబడుతుంది. సాయంత్రం తర్వాత టీ, కాఫీ దూరం పెట్టాలి. పడుకునే ముందు నీరు ఎక్కువగా తాగొద్దు.
News March 28, 2026
ఆ జిల్లాలకు APSDMA బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని 35 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే ఆస్కారముందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40°C-42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇవాళ మార్కాపురం(D) బొట్లగూడురులో 42.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది.