News November 30, 2025
రాష్ట్రస్థాయిలో మెరిసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు

మెదక్ జిల్లాలో ఈ నెల 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.
Similar News
News March 14, 2026
పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
News March 14, 2026
కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్‌కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.
News March 14, 2026
యుద్ధం ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో పెరిగిన వాటర్ బాటిల్ ధరలు?

చిత్తూరులో శనివారం జిల్లా <<19383334>>వాటర్<<>> అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయని తయారీదారులు అంటున్నారు. దీని వలన తమపై అధిక భారం పడుతోందని, దీంతో వాటర్ బాటిల్ ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలకు డీలర్లు సహకరించాలని జిల్లా వాటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.


