News November 30, 2025

నెల్లూరులో మెడికో విద్యార్థి సూసైడ్ !

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News February 18, 2026

నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

image

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకోనున్నారు.

News February 18, 2026

5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.