News November 30, 2025

పెద్దపల్లి: విషాదం.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

image

కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లికి చెందిన కొమ్మేటి దేవయ్య దంపతులు నగునూర్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. లారీని తప్పించే క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో దేవయ్య, ఎదుటి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన దేవయ్య భార్య అనసూర్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 18, 2026

కడప: పిడుగు పడి ఒకరి మృతి

image

కడప జిల్లా కాశినాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈక్రమంలో ఆయన చనిపోయారు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో బంధువులు బోరున విలపించారు.

News March 18, 2026

నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

News March 18, 2026

విశాఖలో మళ్లీ వారికే సీట్లు: బొత్స హామీ

image

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస సమయంలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి తోడుగా ఉన్న వారిని ప్రోత్సహిస్తామని కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. విశాఖలో భూ ఆక్రమణలు పెరిగాయని, కూటమి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.