News November 30, 2025
జగిత్యాల: 2వ విడత సర్పంచ్‌కు171.. వార్డ్ మెంబర్‌కు 238 నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 171, వార్డు మెంబర్ స్థానాలకు 238 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్ మండలంలో17, జగిత్యాల9, జగిత్యాల రూరల్36, కొడిమ్యాల33, మల్యాల19, రైకల్39, సారంగాపూర్18, వార్డ్ మెంబర్ కు బీర్పూర్30, జగిత్యాల11, జగిత్యాల రూరల్34, కొడిమ్యాల41, మల్యాల48, రైకల్45, సారంగాపూర్ మండలంలో 29 వచ్చాయన్నారు.
Similar News
News March 18, 2026
74 మంది ఎమ్మెల్యేలకు TMC షాక్

W.బెంగాల్ CM మమత 74మంది సిట్టింగ్ MLAలకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీకున్న MLA(223)లలో ఇది 3వ వంతు కావడం గమనార్హం. 3పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిన్న ప్రకటించిన 291మంది అభ్యర్థుల్లో 135మంది సిట్టింగ్ MLAలు ఉండగా, 15మంది స్థానాలు మారాయి. WBలో APR 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
News March 18, 2026
HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.
News March 18, 2026
పెద్దపల్లి: ‘మూడు విడతల్లో రైతు భరోసా’

యాసంగి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. CM రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 1,51’300 మంది రైతుల ఖాతాలో రూ. 162.52 కోట్లు నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ అవుతాయన్నారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు నూతనంగా రైతు భరోసా కోసం AEO ల వద్ద మార్చి 25 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.


