News November 30, 2025
పాపన్నపేట: చివరి రోజు సందడి .. మెదటి విడతలో అత్యధికం

మెదక్ జిల్లాలో ఆరు మండలాలకు మొదటి విడతలో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగిసింది. జిల్లాలో అతిపెద్ద మండలం పాపన్నపేటలో అత్యధికంగా 948 నామినేషన్లు వచ్చాయి. 40 సర్పంచ్ స్థానాలకు 221, 348 వార్డు సభ్యుల స్థానాలకు 727 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. సరైన వివరాలు లేనందున 2 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 24, 2026
మెదక్: పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

మెదక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు.
News March 24, 2026
రాష్ట్రపతి నిలయంలో పోటీలు.. మెదక్ విద్యార్థుల ప్రతిభ!

హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండు బహుమతులు సాధించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సింహారెడ్డి తెలిపారు. ఉపన్యాస పోటీలో పూనం రాజ్ పురోహిత్ తృతీయ బహుమతి సాధించగా, నినాదాల(స్లోగన్స్) పోటీలో అభినయ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. విజేతలను కళాశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.
News March 24, 2026
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్‌లో గూగుల్ మీట్ ద్వారా భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలాల వారీగా అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.


