News November 30, 2025

NGKL: సోషల్ మీడియాపై పోలీస్ నిఘా

image

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, రాజకీయ మత విద్వేష పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ ఎస్ఐ కె.గోవర్ధన్ హెచ్చరించారు. సోషల్ మీడియాపై పోలీసుల నిఘ ఉందని తెలిపారు. విద్వేష పోస్టులు పెట్టి శాంతి భద్రతలకు విగంతం కలిగించవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 20, 2026

గద్వాల్: గొర్రెల మేత కోసం ‘నడిగడ్డ’కు వలసలు..!

image

ఎండలు ముదురుతుండటంతో గొర్రెల కాపరులు వలస బాట పట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది గొర్రెలతో కాపరులు జోగులాంబ గద్వాల (నడిగడ్డ) ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడి నల్లరేగడి పొలాల్లో మేత పుష్కలంగా దొరుకుతుందని, అందుకే 3 నెలల పాటు ఇళ్లకు దూరంగా ఉండి ఇక్కడే గొర్రెలను మోపుతామని కాపరులు చెబుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి అధికంగా కాపరులు మేత కోసం వస్తారు.

News March 20, 2026

ఇక్కడి LPG మన అవసరాలకే: హైకోర్టు

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉత్పత్తి చేసే LPGని దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని AP హైకోర్టు ఆదేశించింది. లేదంటే సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం LPGని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News March 20, 2026

ATP: పండగల ఎఫెక్ట్.. పెరిగిన చికెన్ ధరలు

image

ఉగాది, రంజాన్ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాలలో కేజీ చికెన్ గత వారం రూ.260కు విక్రయించారు. నేడు రూ.20లు పెరగగా రూ.280కు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రేపు రంజాన్ సందర్భంగా రూ.300లకు చేరే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెప్పారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.