News November 30, 2025

CM పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఉంగుటూరు మండలంలో CM పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. గోపినాథపట్నం యన్టీఆర్ బరోసా సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు గృహాలకు CM వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని సిద్ధం చేశామని అన్నారు. పర్యటన పూర్తయ్యేంతవరకు వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించామన్నారు.

Similar News

News March 16, 2026

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News March 16, 2026

కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

image

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 16, 2026

జగ్గయ్యపేటలో TDP, జనసేన మధ్య కోల్డ్ వార్!

image

జగ్గయ్యపేట నియోజకవర్గంలో TDP, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పదవులు, పనుల పంపిణీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జనసేనను చూసి TDPకి భయం పట్టుకుందని జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆలయ ట్రస్ట్ పదవుల కేటాయింపు, ప్రొటోకాల్ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యమే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది.