News November 30, 2025

సిద్దిపేట: మొదటి రోజు 228 సర్పంచ్ నామినేషన్స్

image

స్థానిక ఎన్నికల సమరంలో రెండవ విడత నామినేషన్స్ ప్రక్రియ సిద్దిపేటలో ఆదివారం ప్రారంభం అయ్యింది. సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి రోజు 182 గ్రామ పంచాయితీలకు గాను 228 నామినేషన్స్ వచ్చాయి. అలాగే 1644 వార్డు మెంబెర్స్‌కి 287 నామినేషన్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.

Similar News

News March 21, 2026

పొలిటికల్ హీట్.. సొంతగూటిలో సైలెన్స్!

image

‘ధురంధర్-2’ రిలీజ్‌తో ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ మూవీపై తెలుగు హీరోలు సహా పలువురు దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తే పుట్టిల్లు అయిన బాలీవుడ్‌లో మాత్రం సైలెన్స్ వెంటాడుతోంది. సరైన హిట్లు లేక కరవులో ఉన్న బాలీవుడ్‌ ఈ హిట్‌ను సెలబ్రేట్ చేసుకోకపోవడంతో అక్కడి గ్రూప్ పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఇది ప్రొపగండా మూవీ అంటూ <<19436529>>రాజకీయ<<>> విమర్శలను ఎదుర్కొంటోంది.

News March 21, 2026

వారికి ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరిక..!

image

ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.

News March 21, 2026

సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు https://polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.