News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 21, 2026

‘యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గళమెత్తాలి’

image

కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచశాంతి కోరుకుంటూ సమావేశం నిర్వహించారు. సాహితీ స్రవంతి ప్రచురించిన ఉగాది ప్రత్యేక సంచిక ‘సాహిత్య ప్రస్థానం’ను ఆవిష్కరించారు. నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా మాట్లాడుతూ.. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు కలమెత్తి, గలమెత్తాలని పిలుపునిచ్చారు. ఇనాయతుల్లా, స్వర్ణలత పాల్గొన్నారు.

News March 21, 2026

రంజాన్.. కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను టౌన్‌లోకి అనుమతించకుండా తిప్పమ్మకొట్టం వద్ద నుంచి నేషనల్ హైవేపైకి మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్, సీ. క్యాంపు నుంచి నంద్యాల వైపు మళ్ళిస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2026

నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.