News November 30, 2025
మ్యాచ్ ఓడినా ❤️మనసులు గెలిచారు

తొలి వన్డేలో టీమ్ ఇండియాను సౌతాఫ్రికా భయపెట్టింది. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ఆ జట్టు వెనక్కి తగ్గలేదు. కొండంత లక్ష్యం (350) ఉన్నా RSA బ్యాటర్లు చివరి వరకూ పోరాడారు. బ్రెవిస్ (37), జాన్సెన్ (70), బ్రిట్జ్‌కి (72), బాష్ (67) అద్భుతమైన ఆటతీరుతో అలరించారు. దీంతో సౌతాఫ్రికా 332 రన్స్ చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా టీమ్ ఎఫర్ట్‌ను భారత ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మీ COMMENT?
Similar News
News March 24, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
News March 24, 2026
44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నోయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ 44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేేయనుంది. DM/MCh అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఏప్రిల్ 24న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,20,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు, SC, ST, OBC, EWS అభ్యర్థులకు రూ.3500. వెబ్‌సైట్: https://pgich.edu.in
News March 24, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.


