News November 30, 2025

వనపర్తి జిల్లాలో ఎన్నికల వివరాలు..!

image

వనపర్తి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
తొలి దశ – 5 మండలాల్లోని 87 గ్రామాలు, 780 వార్డుల్లో
రెండో దశ – 5 మండలాల్లోని 94 గ్రామాలు, 850 వార్డుల్లో
మూడో దశ – 5 మండలాల్లోని 87 గ్రామాలు, 806 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News March 20, 2026

ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ తేదీల్లో మార్పు: పల్నాడు డీఈవో

image

ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా డీఈఓ నీలావతి దేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మార్చి 21న ప్రారంభం కావాల్సిన ఉండగా..మార్చి 22న నుంచి మొదలవుతాయన్నారు. స్పాట్ వాల్యుయేషన్ ఆర్డర్స్ పొందిన ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు, PGTలు 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు హాజరు కావాలని సూచించారు.

News March 20, 2026

చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

image

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

News March 20, 2026

స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

image

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.