News November 30, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

* కామారెడ్డి: జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకుడు
* జుక్కల్: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
* జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
* మొదటి విడత ఎన్నికల స్కూటీ పూర్తి
* బిక్కనూర్: ఘనంగా అయ్యప్ప ఉత్సవమూర్తుల ఊరేగింపు
* మాచారెడ్డి: మండలంలో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
* సదాశివ్ నగర్: గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి
Similar News
News March 29, 2026
రూ.12,000 కోట్ల ఆస్తి.. చివరికి

‘రేమండ్’తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన <<19504124>>విజయ్‌పత్ సింఘానియా<<>> జీవిత చరమాంకంలో అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2015లో ₹12K కోట్ల కంపెనీతోపాటు తన 37% వాటా(₹1,000 కోట్లు)ను కొడుకు గౌతమ్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో విజయ్ కోర్టుకెక్కారు. కొడుకును నమ్మి ఆస్తులు అప్పగించడం అతిపెద్ద తప్పు అని సింఘానియా గతంలో చెప్పారు.
News March 29, 2026
వైజాగ్‌లో ‘స్మోగ్ టవర్’ ఏర్పాటు

విశాఖలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు RTC కాంప్లెక్స్ సమీపంలో వినూత్నంగా ‘స్మోగ్ టవర్’ను ఏర్పాటు చేశారు. సౌరశక్తితో నడిచే ఈ టవర్ చుట్టుపక్కల గాలిలోని హానికరమైన ధూళి కణాలను (PM 2.5, PM 10) ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ పరికరం నగరవాసుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
News March 29, 2026
నిప్పుల కొలిమిలా ADB జిల్లా

ఆదివారం జిల్లాలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో ఉంది. భానుడి భగభగలకు తోడు వేడి గాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. మరోవైపు సాయంత్రం వేళ కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, పగటిపూట ఉక్కపోత తప్పదని అధికారులు హెచ్చరించారు.


