News November 30, 2025

భద్రాద్రిలో రెండో విడత తొలి రోజు 67 నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం 7 మండలాల్లో ప్రారంభమైంది. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను, తొలి రోజున 21 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, 1384 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 5, 2026

KNR: విద్యుత్ సమస్యా..? ఈ నంబర్‌కు మెసేజ్ చేయండి!

image

విద్యుత్ మెటీరియల్ త్వరగా విడుదల చేయడానికి, మెటీరియల్‌ను త్వరగా డ్రా చేసుకోవడానికి ఈ స్టోర్ల ద్వారా ఆన్‌లైన్ సౌకర్యం అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చాట్ ప్రవేశ పెట్టడం జరిగిందని, దీని ద్వారా సమ్యల పరిష్కారం కోసం వినియోగదారులు 7901628348 ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు.

News March 5, 2026

విశాఖ జూపార్క్‌కు కొత్త జంతువులు

image

విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్‌లో ఇక నుంచి కొత్త జంతువులను చూడవచ్చు. అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి జంతు మార్పిడి జరగడంతో గురువారం పలు జంతువును తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాలయన్ బ్లాక్ టేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియస్ పామ్ సివెట్ ఇక్కడకు చేరుకున్నాయి. విశాఖ నుంచి రింగ్ టెయిల్డ్ లీమూర్, స్టంప్ టెయిల్డ్ మకాక్ తదితర వాటిని పంపారు.

News March 5, 2026

X-RAY లేని కాలంలో గర్భస్థ శిశువుపై శిల్పాలు!

image

కేరళంలోని త్రిశూర్‌లో ఉన్న వడుగనాథ స్వామి ఆలయం భారతీయ శిల్పకళా చాతుర్యానికి, అప్పటి శాస్త్ర విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఎక్స్-రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే గర్భంలోని శిశువు నెలవారీ ఎదుగుదల భంగిమలను కళ్లకు కట్టినట్లు చెక్కారు. నిజంగా మన పూర్వీకులకు గర్భస్థ శిశువుపై ఉన్న పరిజ్ఞానం ఎంత గొప్పదో కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..