News November 30, 2025

100 మీటర్ల దూరంలో ఆంక్షలు: ఎస్పీ నరసింహ

image

రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మునగాల మండలంలోని రేపాలలోని నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ నరసింహ ఆదివారం పరిశీలించారు. ఎన్నికలకు ఐదు అంచెల పోలీసు భద్రత ఉండాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేయాలని, అనుమతులు ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి పంపించాలని ఆయన సూచించారు.

Similar News

News March 10, 2026

ఈరోజు నమాజ్ వేళలు (10-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 10, 2026

నిర్మల్: 20 ఏళ్లుగా విద్యుత్ లేక అవస్థలు

image

నిర్మల్ జిల్లాలోని రంజని తాండాలో గత 20 ఏళ్లుగా 50 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, తమ ఇళ్లకు వెలుగులు నింపాలని వారు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడం లేదని వాపోయారు. ఒక పక్క గ్రామాల అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ అంటున్నా.. తమ గ్రామం ఇంకా చీకట్లోనే ఉందన్నారు.

News March 10, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.