News November 30, 2025

భద్రాద్రిలో రెండో విడత తొలి రోజు 71 నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో 7 మండలాల నుంచి తొలి రోజున మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 మంది సర్పంచ్ పదవులకు, 46 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మండలాల వారీగా సర్పంచి, వార్డు మెంబర్లు.. దమ్మపేట 9-6, అశ్వారావుపేట 8-11, చండ్రుగొండ 4-15, ములకలపల్లి 2-3, చుంచుపల్లి 1-8, పాల్వంచ 1-1, అన్నపురెడ్డిపల్లి 0-2.

Similar News

News March 24, 2026

KNR: పాపం పసిప్రాణాలు.. ఓ కన్నేయండి.!

image

చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రోజురోజుకు తగ్గిపోతుంది. ఇటీవల ప్రమాదవశాత్తు చిన్నారులు మృతి చెందిన ఘటనలు చాలానే జరిగాయి. PDPL(D) ధర్మారం(M) కటికెనపల్లికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరాం (6) సోమవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతిచెందగా.. KNR(D) శంకరపట్నం(M) కేశవపట్నం హైవేపై ఆదివారం లారీ ఢీకొనడంతో మూడేళ్ళ బాలిక మృతి చెందింది. JGTL(D)లో కుక్క కాటుకు గురై మణితేజ(7) బాలుడు మృతి చెందాడు.

News March 24, 2026

నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

image

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్‌తో ఆడుకున్నాడు.

News March 24, 2026

సంగారెడ్డి: ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాజీ పడదగ్గ కేసులను కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.